వ్యాక్సిన్​ సైంటిస్ట్​కు బార్బీ బ్యూటిఫుల్​ గిఫ్ట్​

వ్యాక్సిన్​ సైంటిస్ట్​కు బార్బీ బ్యూటిఫుల్​ గిఫ్ట్​

ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న బార్బీ కంపెనీ రకరకాల బొమ్మల్ని చేస్తుందనేది తెలిసిన విషయమే! పిల్లలను ఆకర్షించేందుకు డాక్టర్​ బార్బీ, కిచెన్​ బార్బీ, అథ్లెట్​ బార్బీ వంటి రకరకాల బొమ్మలను మార్కెట్​లోకి తెస్తోంది. అలాగే అప్పుడప్పుడూ ప్రముఖ వ్యక్తుల గౌరవ సూచకంగా బొమ్మలను డిజైన్​ చేసి, వారికి అందిస్తుంది. ఇప్పుడు ఆస్ర్టాజెనికా కొవిడ్​ వాక్సిన్ తయారీలో ఉన్న ఆరుగురి టీమ్​లో ఒకరైన బ్రిటన్​ సైంటిస్ట్ ​ సారా గిల్బర్ట్​ మోడల్​ బొమ్మను బార్బీ కంపెనీ డిజైన్​ చేసింది. 

గతంలో బార్బీ కంపెనీ...  నటి మార్లిన్​ మాన్రో, అమెరికా ఫేమస్​ సింగర్​ బియోన్స్, అమెరికా పొలిటిషియన్ ఎలియనోర్ రూజ్‌‌‌‌వెల్ట్‌‌ వంటి ప్రముఖుల బొమ్మలు తయారు చేసింది. ఇప్పుడు బ్రిటన్​కు కొవిడ్​ వ్యాక్సిన్​ అందించటంలో కీలకంగా పని చేసి, ఆస్ట్రాజెనికా టీకాను తయారు చేసిన గిల్బర్ట్​ ఈ ప్రశంసలు అందుకుంది. 

ఆక్స్‌‌ఫర్డ్ యూనివర్సిటీలో గిల్బర్ట్ ప్రొఫెసర్ గా పని చేస్తోంది. అలాగే ఆక్స్‌‌ఫర్డ్ వ్యాక్సిన్​ తయారు చేసిన ఆరుగురు విమెన్​ టీమ్​లో గిల్బర్ట్​ కూడా ఉన్నారు. కొవిడ్​ను బారి నుంచి ప్రజలను రక్షించడంలో మహిళగా తన పాత్రను ఆమె గర్వంగా చెప్పుకుంటారు ‘సైన్స్‌‌లో కెరీర్‌‌ గురించి అమ్మాయిలు చాలా తక్కువ మంది ఆలోచిస్తారనే మాటల్ని తప్పని నిరూపించడానికే నేను కష్టపడుతున్న’ అంటారామె. దీంతో ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న బార్బీ గిల్బర్ట్​ మోడల్​ను తయారు చేసింది. పొడవైన జుట్టు, నలుపు రంగు కళ్లద్దాలు, నేవీ బ్లూ సూట్, వైట్ బ్లౌజ్​తో బార్బీ బొమ్మ ఉంటుంది. ‘నా పోలికలో బార్బీ బొమ్మ డిజైన్​ చేయడం హ్యాపీగా ఉంది’ అని గిల్బర్ట్​ చెబుతోంది. ఈ మోడల్​ బొమ్మ సైన్స్​ రంగంలో పిల్లలకి ఆసక్తి కలిగేలా చేస్తుందని బార్బీ కంపెనీ చెప్పింది.