బాసర రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి దొంగల బీభత్సం

బాసర రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి దొంగల బీభత్సం

నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ లో దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. 10 మంది దొంగల ముఠా… కత్తులు, గొడ్డళ్లు, కర్రలు పట్టుకుని రైల్వే స్టేషన్ పరిసరాల్లో తిరిగారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నగదు, బైక్ ల దొంగతనానికి ప్రయత్నం చేశారు. స్థానికులు, పోలీసులు అలర్ట్ కావడంతో దొంగలు పారిపోయారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు, వీరిని టార్గెట్ చేస్తూ దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. స్థానికులు, బాసర పోలీసులు అప్రమత్తం కావడంతో రైల్వే స్టేషన్ రెండో ప్లాట్ ఫాం పై నుంచి దూకి పరారయ్యారు. పంట చేలల్లో పడుకున్న వారిని బెదిరించి నగదు ఎత్తుకెళ్లారు. ఇళ్ల ముందు నిలిపి ఉంచిన మూడు బైక్ లను ఎత్తుకెళ్లి చేలల్లో వదిలి పెట్టారు. సికింద్రాబాద్ నుంచి మన్మాడ్ వెళ్లే రైల్లో ఈ దొంగల ముఠా వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

దొంగల ముఠా బీభత్సంలో స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు. స్థానికులు కూడా… అర్ధరాత్రి పూట కర్రలు పట్టుకొని  దొంగల కోసం గాలించారు. బాసర రైల్వే స్టేషన్లో తనిఖీలు ముమ్మరం చేశారు.