సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు

సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు

నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జ్ వీసీ వెంకటరమణ కలిశారు. యూనివర్సిటీలో మౌలిక స‌దుపాయాల క‌ల్పన‌కు తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివ‌రించారు.ట్రిపుల్ ఐటీలో అభివృద్ధి ప‌నులు, క్యాంటిన్ నిర్వహణ, ఆహార నాణ్యత, బొధ‌న‌, బోధ‌నేత‌ర అంశాలపై చర్చించారు. అలాగే ట్రిపుల్ ఐటీలో మౌలిక స‌దుపాల‌య క‌ల్పన‌కు, నాణ్యమైన విద్యా బోధ‌న‌కు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వీసీకి -మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సమస్యలు పునరావృతం కాకుండా ప్రణాళిక‌ల రూప‌కల్పన చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు.. క‌మిటీల ఏర్పాటు వేగంగా పూర్తి చేస్తామన్నారు. విద్యార్థుల భ‌విష్యత్, వారి ప్రయోజ‌నాలే తమకు ముఖ్యమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. త్వర‌లోనే యూనివ‌ర్సిటీని సంద‌ర్శించి, క్షేత్ర స్థాయిలో ప‌రిశీలిస్తామని వీసీ వెంకటరమణకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.