హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో, మీడియాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిపై నిరాధారమైన, అసత్య వార్తలు రావడం దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రేటింగ్‌లు, వ్యూస్ కోసం వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే వార్తలు రాయడమే మీడియా బాధ్యత అవుతుందా ? అని ప్రశ్నించారు.
శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. " మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో చరిష్మా, చరిత్ర ఉన్న నేత. ఆయన విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగి మంత్రి స్థాయికి చేరుకున్నారు. అలాంటి వ్యక్తిపై నిరాధారమైన వ్యక్తిగత ఆరోపణలు, అసత్య వార్తలు రావడం దురదృష్టకరం. రాజకీయ నేతలపై బురద జల్లేలా, నిరాధారమైన, అసత్య వార్తలు రాయడం సరికాదు" అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
