బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతోన్న ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో  కొనసాగుతోన్న ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో  E1, E2 విద్యార్థుల  నిరసనలు కొనసాగుతున్నాయి. రాత్రి 3 గంటల వరకు  మెస్ లో జాగారం  చేశారు.  ఉదయం నుంచి  బ్రేక్ ఫాస్ట్  చేయకుండా  ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. ఇంచార్జ్  వీసీ  వచ్చి  చర్చలు జరిపినా విద్యార్థులు పట్టు వీడలేదు.  తాము లేవనెత్తిన   5 డిమాండ్లపై  క్లారిటీ ఇవ్వాలని డిమాండ్  చేస్తున్నారు. ఐదు డిమాండ్లలో ఒకదానిపై స్పందించి.. మెస్ టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మిగితా 4 డిమాండ్లనూ అమలు చేయాలని విద్యార్థులు నిలదీస్తున్నారు. 

ఫుడ్ పాయిజన్ ఇష్యూ  తర్వాత ఇచ్చిన  హామీలు అమలు కాలేదంటూ నిరసన తెలుపుతున్నారు . ఐదు డిమాండ్లపై   వీసీ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని విద్యార్థులు మండిపడుతున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు  పూర్తి బాధ్యత  వహించిన  స్టూడెంట్ వెల్ఫేర్ కు  చెందిన సిబ్బంది  మొత్తం త్వరలో  రాజీనామా చేస్తారన్నారని.. అయినా ఎలాంటి చర్యలు  తీసుకోలేదంటున్నారు. 

మెస్ మేనేజ్ మెంట్ కి ఇచ్చిన షోకాజ్ నోటీసు పై  వారు వివరణ ఇచ్చారా ? లేదా ? అనే దానిపై ఎలాంటి అప్ డేట్ లేదంటున్నారు విద్యార్థులు. ఫుడ్ పాయిజన్ కు కారణమైన శాంపిల్స్ రిపోర్టులను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తున్నారు. కారణం బహిరంగంగా ఎందుకు ప్రకటించలేదని ఫైరవుతున్నారు.  జూలై 24 నాటికి మెస్ ల కోసం కొత్త టెండర్లు పిలుస్తామని చెప్పి ఆలస్యం చేశారన్నారు. తమ నిరసనతో ఆగమేఘాల మీద మెస్ టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేశారంటున్నారు విద్యార్థులు.