నవంబర్ 23న మాల రణభేరి సక్సెస్ కోసం బస్తీ బాట

నవంబర్ 23న మాల రణభేరి సక్సెస్ కోసం బస్తీ బాట
  • ప్రేమ్​నగర్​లో మాలలను చైతన్యపరిచే కార్యక్రమం  
  • పోస్టర్ను ఆవిష్కరించిన చెన్నయ్య, వెంకటేశ్వర్లు

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్​లో ఈ నెల 23న నిర్వహించనున్న మాల రణభేరి మహాసభ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం మాలమహానాడు బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు తో కలిసి మంగళవారం ప్రేమ్ నగర్ లోని మాల వీధుల్లో తిరిగి వారిని చైతన్యపరిచారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్​లో మాలల రణభేరి మహాసభ పోస్టర్, కరపత్రాన్ని ఆవిష్కరించారు.

చెన్నయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్క మాల కుటుంబం రణభేరి మహాసభకు తరలిరావాలని, అన్ని రాజకీయ పార్టీలకు మాలల సత్తా చూపెట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రోస్టర్ పాయింట్లను సాధించుకోవాలని, నిరుద్యోగ మాలలకు అన్యాయం జరగకుండా కాపాడుకుంటామన్నారు. మాల మహానాడు రాష్ట్ర నాయకులు కే. భగవాన్ దాస్, బస్తీ అధ్యక్షుడు దాసరి విశ్వనాథం, బస్తీ చైర్మన్ మహేశ్ కుమార్, ట్రెజరర్​సుధీర్ కుమార్, సభ్యులు బాబురావు, మున్నా, ప్రవీణ్ కుమార్, గణముల హర్షవర్ధన్ పాల్గొన్నారు.