సెక్రటేరియెట్​లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సెక్రటేరియెట్​లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సెక్రటేరియెట్​లో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ జరగగా.. ఉన్నతాధికారుల నుంచి అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చిన మహిళలు.. వారి పిల్లలతో కలిసి ఉత్సాహాంగా సంబురాలు చేశారు. దాండియా ఆడుతూ బతుకమ్మ పాటలు పాడారు.

- హైదరాబాద్, వెలుగు