V6 News

పద్మారావునగర్ పార్కులో బతుకమ్మ వేడుకలు

పద్మారావునగర్ పార్కులో బతుకమ్మ వేడుకలు
  • హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్

పద్మారావునగర్​, వెలుగు: శనివారం రాత్రి  పద్మారావునగర్ పార్కు వద్ద బతుకమ్మ వేడుకలు సంబురంగా జరిగాయి. వందలాది మంది మహిళలు, చిన్నారులు భారీ ఎత్తున బతుకమ్మను పేర్చి పాటలు పాడారు. ఈ వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. సనత్ నగర్ సెగ్మెంట్ వాసులకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలను తెలిపారు. బీఆర్ఎస్ పద్మారావునగర్ ఇన్ చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ ఎల్. వెంకటేశన్ రాజు, మామిడి బాల్ రెడ్డి, నాగులపల్లి మల్లేశ్, హరిచారి, శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.