జనగామ/ తొర్రూరు/ వెంకటాపురం/ ఖిలా వరంగల్(కరీమాబాద్), వెలుగు : నేటి నుంచి స్కూళ్లకు సెలవులు కావడంతో మంగళవారం ఉమ్మడి వరంగల్‌జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్లు, స్టూడెంట్లు బతుకమ్మలను పేర్చి స్కూల్ఆవరణలో ఒక్కచోట పెట్టి ఆడిపాడారు. జనగామ నారాయణ హై స్కూల్లో ప్రిన్సిపల్ఫర్హాన, డీన్విక్రమ్ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు వరంగల్జోన్డీజీఎం రిజ్వానా చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు.
మహబూబాబాద్జిల్లా తొర్రూరు పట్టణంలోని లిటిల్ప్లవర్స్కూల్లో చైర్మన్అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, వికాస్స్కూల్లో డైరెక్టర్తాళ్లపల్లి రమేశ్గౌడ్ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ములుగు జిల్లా వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలలో, వరంగల్‌తూర్పు సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.