
హైదరాబాద్, వెలుగు: భారత్‌జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 21న యూకేలో బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో భారత్‌జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ పోస్టర్ఆవిష్కరించి మాట్లాడారు.జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ వేడుకలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు.
బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు తేవడానికి వివిధ దేశాల్లోని జాగృతి కార్యకర్తలు కృషి చేశారన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జాగృతి యూకే అధ్యక్షుడు బల్మూరి సుమన్, తెలంగాణ ఫుడ్స్చైర్మన్మేడె రాజీవ్‌సాగర్, జాగృతి జనరల్సెక్రటరీ నవీన్ఆచారి తదితరులు పాల్గొన్నారు.