
హైదరాబాద్: అంబర్పేట్ పరిధిలోని బతుకమ్మ కుంట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఒకప్పుడు ఆక్రమణలతో సగమైన ఈ బతుకమ్మ కుంట హైడ్రా వచ్చాక తిరిగి పునరుజ్జీవనం పోసుకుంది. 7కోట్ల40 లక్షల రూపాయలతో బతుకమ్మ కుంట సుందరీకరణ చేపట్టింది రాష్ట్రప్రభుత్వం. అన్ని పనులు ముగించుకొని ప్రారంభోత్సవానికి బతుకమ్మ కుంట రెడీగా ఉంది. శుక్రవారం(సెప్టెంబర్ 26) సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
5 ఎకరాల 15 గుంటల స్థలంలో బతుకమ్మ కుంట పేరుతో వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇన్ లెట్, ఔట్ లెట్, దీంతోపాటు చుట్టూ వాక్ వే, వాక్ వే చుట్టూ చెట్లు నాటి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ ఏర్పాటుతో అందరిని ఆకర్షిస్తోంది.