బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: బతుకమ్మ చీరెల పంపిణీ, కొత్త కొత్త డిజైన్ లను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. నగరంలోని హోటల్ టూరిజం ప్లాజా లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, టెస్కో ఎండి శైలజ రామయ్యర్,మహిళ సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. చేనేతకు చేయూతలో భాగంగా సిరిసిల్ల మరమగ్గాలపై బతుకమ్మ చీరెల తయారీ చేశారు. 287 విభిన్నమైన డిజైన్లలో బంగారు, వెండి, జరి అంచులతో తయారీ చేసిన పాలిస్టర్ ఫిలిమెంట్, నూలు చీరెలు ఉన్నాయి. సుమారు రూ.317.81 కోట్ల వ్యయం తో చీరెలు తయారీ చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం కోటికి పైగా చీరెల పంపిణీ చేస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలకు చీరలు చేరాయి.. అక్టోబర్ రెండో వారంలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.