గ్రేటర్లో బతుకమ్మ, దేవీ నవరాత్రుల ఉత్సవాలు

గ్రేటర్లో బతుకమ్మ, దేవీ నవరాత్రుల ఉత్సవాలు

గ్రేటర్ వ్యాప్తంగా బతుకమ్మ, దేవీ నవరాత్రుల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఆలిండియా ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో లుంబినీ పార్కులో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విశాక ఇండస్ట్రీస్ ఎండీ, అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్ చీఫ్​గెస్టుగా హాజరై బతుకమ్మ ఆడారు. బల్దియా ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్​లోని పీపుల్స్ ప్లాజాలో రాత్రి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

బీజేపీ మహేశ్వరం సెగ్మెంట్ ఇన్​చార్జి అందెల శ్రీరాములు  ఆధ్వర్యంలో బడంగ్​పేట క్రీడా ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు జరగగా..  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భార్య కావ్యారెడ్డి పాల్గొన్నారు.  గాంధీ హాస్పిటల్​లోని మైక్రో బయాలజీ డిపార్ట్ మెంట్​లో ముందస్తుగా దసరా వేడుకలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. హెచ్​వోడీ ప్రొఫెసర్ ఎస్. రాజేశ్వరరావు, ప్రొఫెసర్ నాగమణి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నవనీత, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ జిగీషా పాల్గొన్నారు.