V6 News

బీసీ గురుకులాల్లో అవినీతిపై విచారణ జరిపించండి : జక్కని సంజయ్

బీసీ గురుకులాల్లో అవినీతిపై విచారణ జరిపించండి :  జక్కని సంజయ్
  • ఎన్సీబీసీకి జక్కని సంజయ్ విజ్ఞప్తి 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్ సొసైటీలో అవినీతి జరుగుతోందని బీసీ ఆజాది ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ అన్నారు.

 ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ కమిషన్(ఎన్సీబీసీ)కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో ఎన్సీబీసీ కార్యదర్శి, పర్సన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోచన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.