పటాన్  ‌‌ ‌‌చెరు టికెట్ పై..   కేసీఆర్ పునరాలోచించాలి

పటాన్  ‌‌ ‌‌చెరు టికెట్ పై..   కేసీఆర్ పునరాలోచించాలి
  • ఇస్నాపూర్ లో బహుజన వర్గాల భారీ ర్యాలీ, రాస్తారోకో

పటాన్​చెరు, వెలుగు : పటాన్  ‌‌ ‌‌చెరు ఎమ్మెల్యే టికెట్ కేటాయింపుపై కేసీఆర్  పునరాలోచించాలని బీసీ బహుజన నేతలు కోరారు. బీసీ వర్గాల నేత నీలం మధు కు పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని పటాన్  ‌‌ ‌‌చెరు మండలం ఇస్నాపూర్ నుంచి చౌరస్తా వరకు ముదిరాజ్ సంఘం నాయకులతో పాటు బహుజన నాయకులు భారీ ర్యాలీ  నిర్వహించారు. అనంతరం ‘బీసీల ఐక్యత వర్ధిల్లాలి..  సబ్బండ వర్గాల నాయకులకు న్యాయం చేయాలి’ అంటూ నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం పేరుతో పాలన కొనసాగిస్తున్నానని చెప్తున్న కేసీఆర్ బీసీ వర్గాల నాయకులకు టికెట్ కేటాయింపులో చిన్న చూపు చూడడం ఎంత వరకు సమంజసమన్నారు. బీసీ లను కేవలం ఓటు బ్యాంకు గా వాడుకుంటూ బహుజన వర్గాల నాయకులని తొక్కి పెడుతున్నారని విమర్శించారు.

బీఆర్ ఎస్ పార్టీ ని విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లిన నీలం మధు కు టికెట్ కేటాయించకపోవడం సరికాదన్నారు. బీ ఆర్ ఎస్ పటాన్ చెరు టికెట్ పై పునరాలోచన చేసి బహుజన నాయకుడు నీలం మధు ముదిరాజ్ కు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీసీలంతా ఏకమై మా సత్తా చూపెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మన రజక సంఘం ప్రధాన కార్యదర్శి చాకలి వెంకటేశ్, చాకలి సంజీవ్, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ గారెల శ్రీను ముదిరాజ్,లక్ష్మారెడ్డి, దానయ్య , వడ్డెర వెంకటేవ్, శ్రీనివాస్ గౌడ్, గౌరి చారి, మల అనిల్,మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.