బీపీ మండల్ సిఫార్సులతోనే బీసీలకు రిజర్వేషన్లు : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

బీపీ మండల్ సిఫార్సులతోనే బీసీలకు రిజర్వేషన్లు : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
  • రాష్ర్టంలో 42% రిజర్వేషన్ల  సాధనకు ఉద్యమం చేయాలే: బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

హైదరాబాద్, వెలుగు:  బీసీలకు 27 శాతం రిజర్వేషన్ సాధించటంలో తొలి అడుగు వేసిన వ్యక్తి బీపీ మండల్ అని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. అప్పటి ప్రధాని వీపీ సింగ్ 27 శాతం  రిజర్వేషన్ కల్పించి బీపీ మండల్ సిఫార్సులను అమలు చేశారన్నారు. మంగళవారం బీపీ మండల్ జయంతి సందర్భంగా కమిషన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఇప్పటికే ఢిల్లీలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారని, బీసీలకు ఆర్థికంగా సామాజికంగా స్థిరత్వం వచ్చేవరకు రిజర్వేషన్లు అమలులో ఉండాలని కోరారు. రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు సాధించే దిశలో ఉద్యమించాల్సిన అవసరమని చెప్పారు. 

గురుకుల సీట్ల వివరాలివ్వండి..

గురుకుల సొసైటీలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు ఇవ్వాలని సెక్రటరీ సైదులును కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశించారు. కార్యాలయాలకు వచ్చేవారి కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సెక్రటరీని చైర్మన్ ఆదేశించారు.