జూబ్లీహిల్స్ బై పోల్లో బీసీ బిడ్డ నవీన్ యాదవ్ను గెలిపించండి

జూబ్లీహిల్స్ బై పోల్లో బీసీ బిడ్డ నవీన్ యాదవ్ను  గెలిపించండి
  • ఓటర్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల బహిరంగ లేఖ

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ బై పోల్​లో రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డ నవీన్ యాదవ్​కు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. 

ఆదివారం ఈ లేఖను హైదరాబాద్​లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వివిధ సంఘాల నేతలతో కలిసి మీడియాకు విడుదల చేశారు. జాజుల మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ లో ఏమి జరగబోతుందా అని దేశమంతా ఎదురుచూస్తున్నదని, ఈ ఎన్నిక  మీదనే బీసీల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉందని తెలిపారు. 

ఇలాంటి కీలక సమయంలో అన్ని పార్టీల్లోని బీసీ నాయకులు బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్​కు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు అసెంబ్లీలో 19 మంది మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. 

నవీన్ యాదవ్ గెలుపుతో.. బీసీ ఎమ్మెల్యేలు, మంత్రుల సంఖ్య పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలలో టికెట్లు ఇవ్వకుండా నిరాకరించిన బీసీ వ్యతిరేక పార్టీలకు తమ ఓటు ద్వారా బీసీలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.