బీసీ స్కాలర్ షిప్​లకు రూ. 387 కోట్లు విడుదల

బీసీ స్కాలర్ షిప్​లకు రూ. 387 కోట్లు విడుదల

హైదరాబాద్, వెలుగు: 2024–25 ఫైనాన్సియల్ ఇయర్​కు సంబంధించి బీసీ స్కాలర్ షిప్​ల కోసం రూ.387.51 కోట్ల నిధులు సాంక్షన్ చేస్తూ బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్ర టరీ బుర్రా వెంకటేశం శనివారం జీవో విడు దల చేశారు. ఈ ఫైనాన్సియల్ ఇయర్​లో తొలి క్వార్టర్ నిధులుగా ఉత్తర్వుల్లో  వెల్లడించారు. అకడమిక్ ఇయర్ స్టార్ట్ కానున్నందున పాత బకాయిలు క్లియర్ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్ సిస్ విద్యా నిధి స్కీమ్ కు రూ.15 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ వెంకటేశం మరో జీవో జారీ చేశారు.  విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునే వారికి రూ.20 లక్షలు ఈ స్కీమ్ కింద ప్రభుత్వం అందిస్తోంది. దీంతో పెండింగ్​లో ఉన్న అప్లికేషన్లు క్లియర్ కానున్నాయి.