IPL 2025: జోష్ వస్తున్నాడు.. మార్కో వెళ్తున్నాడు: క్వాలిఫయర్ 1కు పంజాబ్, బెంగళూరు ప్లేయింగ్ 11 ఇవే!

IPL 2025: జోష్ వస్తున్నాడు.. మార్కో వెళ్తున్నాడు: క్వాలిఫయర్ 1కు పంజాబ్, బెంగళూరు ప్లేయింగ్ 11 ఇవే!

ఐపీఎల్ 2025లో ప్రస్తుతం అందరి దృష్టి క్వాలిఫయర్ 1 మీదే ఉంది. ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ లేని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ గురువారం (మే 29) క్వాలిఫయర్ 1 లో గెలిచి ఫైనల్ కు వెళ్లాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ చండీఘర్ లో జరగనుండడంతో పంజాబ్ జట్టుకు కలిసి రానుంది. మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ సమరంలో ఫైనల్ బెర్త్ పై ఇరు జట్లు కన్నేశాయి. ఇరు జట్ల మధ్య ప్లేయింగ్ ఎలా ఉండబోతుందో ఆసక్తికరంగా మారింది. క్వాలిఫయర్ 1 లో పంజాబ్, ఆర్సీబీ ఎలాంటి ప్లేయింగ్ 11 జట్లతో బరిలోకి దిగబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. స్టార్ ప్లేయర్లు జోష్ హేజల్ వుడ్, టిమ్ డేవిడ్ లేకుండానే లానో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ బరిలోకి దిగింది. క్వాలిఫయర్ ప్లే ఆఫ్స్ కు స్టార్ ప్లేయర్లు హేజల్ వుడ్, టిమ్ డేవిడ్ వస్తున్నారని ఆర్సీబీ స్టాండింగ్ కెప్టెన్ జితేష్ శర్మ కన్ఫర్మ్ చేశాడు. నువాన్ తుషార్ స్థానంలో హేజల్ వుడ్,  లివింగ్ స్టోన్ స్థానంలో టిమ్ డేవిడ్ తుది జట్టులోకి వస్తారు. లక్నోతో జరిగిన మ్యాచ్ లో తుషార, లివింగ్ స్టోన్ ఘోరంగా విఫలమయ్యారు. 

►ALSO READ | IPL 2025: ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11లో బట్లర్, జాక్స్.. గుజరాత్, ముంబై జట్ల పరిస్థితి ఏంటి..

ఇక పంజాబ్ విషయానికి వస్తే ఆ జట్టు సౌతాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ లేకుండా బరిలోకి దిగుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ కోసం జాన్సెన్ స్వదేశానికి వెళ్ళిపోయాడు. జాన్సెన్ స్థానంలో ఆల్ రౌండర్ అజమాతుల్లా ఓమార్జాయి జట్టులో కొనసాగుతాడు. గాయంతో చివరి రెండు ఐపీఎల్ మ్యాచ్ లు ఆడని యుజ్వేంద్ర చాహల్ పంజాబ్ ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. ఈ రెండు మార్పులు మినహా లీగ్ దశలో ముంబైతో ఆడిన జట్టుతోనే పంజాబ్ ఆడనుంది.           

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11(అంచనా) :

ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యుజ్వేంద్ర చాహల్, కైల్ జామీసన్, వైషక్ విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11(అంచనా): 

ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, యశ్ దయాల్, జోష్ హేజల్ వుడ్, రజత్ పాటిదార్