IPL 2025: ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11లో బట్లర్, జాక్స్.. గుజరాత్, ముంబై జట్ల పరిస్థితి ఏంటి..

IPL 2025: ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11లో బట్లర్, జాక్స్.. గుజరాత్, ముంబై జట్ల పరిస్థితి ఏంటి..

ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ గురువారం (మే 29) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో భాగంగా మొత్తం మూడు వన్డేలకు ఇంగ్లాండ్ ఆతిధ్యమిస్తుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్, లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వరుసగా మూడు వన్డేలకు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. రేపు జరగనున్న మ్యాచ్ కు ఇంగ్లాండ్ బుధవారం (మే 28) ప్లేయింగ్ 11 ప్రకటించింది. ఇంగ్లాండ్ తుది జట్టులో మాజీ కెప్టెన్ జొస్ బట్లర్ తో పాటు.. ఆల్ రౌండర్ విల్ జాక్స్ చోటు దక్కించుకున్నారు. 

బట్లర్ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున 500 పైగా పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టులో విల్ జాక్స్ కీలక ప్లేయర్. వీరిద్దరూ దేశం తరపున ఆడడం కోసం ఐపీఎల్ వదిలి ఇంగ్లాండ్ వెళ్లిపోయారు. దీంతో రెండు జట్లు కాస్త బలహీనంగా మారాయి. ముఖ్యంగా బట్లర్ లేకపోవడం గుజరాత్ టైటాన్స్ కు భారీ దెబ్బ. బట్లర్ స్థానంలో శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండీస్ ఇప్పటికే గుజరాత్ జట్టులో చేరాడు. బట్లర్ స్థానంలో మెండీస్ రావడం ఖాయమైపోయింది. మెండీస్ వికెట్ కీపర్ కావడం అతనికి కలిసి రానుంది. 

విల్ జాక్స్ స్థానంలో ముంబై ఇండియన్స్ జానీ బెయిర్ స్టోను నియమించుకుంది. ఈ ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ రూ.5.25 కోట్ల రూపాయలకు ముంబై జట్టులో చేరనున్నాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. గుజరాత్, ముంబై జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి. శుక్రవారం (మే 30) అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. బట్లర్ లేని లోటును కుశాల్ మెండీస్.. అదేవిధంగా జాక్స్ లేని లోటును బెయిర్ స్టో ఎలా తీరుస్తారో చూడాలి.    

వెస్టిండీస్ తో తొలి వన్డేకు ఇంగ్లాండ్ జట్టు:  

హ్యారీ బ్రూక్ (కెప్టెన్), టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, జో రూట్, జేమీ స్మిత్, ల్యూక్ వుడ్

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)