
శంషాబాద్ లోని అర్కన్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ చేశారు డాక్టర్లు.. ఆరు నెలలుగా క్యాన్సర్ గుడ్డతో నరకయాతన అనుభవిస్తున్న ఓ యువకుడికి 8 గంటల పాటు కస్టపడి సర్జరీ చేసి క్యాన్సర్ గడ్డను తొలగించారు డాక్టర్లు. ఇండియాలోనే ఇది అతిపెద్ద సర్జరీ అని తెలిపారు డాక్టర్లు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడికి గత ఆరు నెల క్రితం వ్యవసాయం చేస్తుండగా ట్రాక్టర్ చాతికి తగిలి గాయపడ్డాడు. అది కాస్త క్యాన్సర్ గడ్డగా మారి ఎంతో ఇబ్బంది పడుతున్నాడని ఎన్ని ఆసుపత్రులు తిరిగినా తగ్గలేదు.
దీంతో శంషాబాద్ లోని అర్కన్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అక్కడి డాక్టర్లు 8 గంటలుగా సర్జరీ లో కష్టపడి ఛాతిలోని క్యాన్సర్ గడ్డను తొలగించారు. ఈ సందర్భంగా చాతి సర్జన్ డాక్టర్ అరుణ్ మాట్లాడుతూ కృష్ణ అనే పేషెంట్కు చాతిలో అరుదైన క్యాన్సర్ సోకిందని ఈ క్యాన్సర్ను కాంగ్రెస్ అరుకోమా అంటారు. ఈ ఆపరేషన్ ఇండియాలోనే అరుదైన ఆపరేషన్ అన్నారు. ఈ ఆపరేషన్ హైదరాబాద్ లోని ఇతర ఆస్పత్రులలోచేస్తే దాదాపు పది లక్షల పైగా ఖర్చు అవుతుందన్నారు.
శంషా బాద్లోని అర్కన్ ఆసుపత్రిలో అన్ని వస్తువులు ఉండడంతో డాక్టర్ చంద్రకాంత్ రెడ్డి మిగతా డాక్టర్ రా సహకారంతో తక్కువ ఖర్చుతో యువకుడికి సర్జరీ చేసి చాతిలోని బోన్స్ ప్లాస్టిక్ సర్జర్ తో చేసి ఆపరేషన్ చూసి క్యాన్చర్ గడ్డను తొలగించి సర్జరీ సక్సెస్ చేయడం జరిగిందన్నారు. 8 గంటలు కష్టపడి యువకుడికి జాతిలో ఉన్న క్యాన్సర్ గడ్డను పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు.
ఏడు రోజులపాటు పేషెంట్ ను అబ్జర్వేషన్లో ఉంచి పూర్తిగా నయమయ్యాకే ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. ఇకముందు కూడా పేషెంట్ అరు నెలలకు ఒకసారి జనరల్ చెకప్ చేసుకోవాలని అన్నారు. ఈ సర్జరీకి సంబంధించి ఆల్ ఇండియా గ్రూపులో కూడా డిస్కస్ చేయడం జరిగిందని అందరూ అభినందించారని అన్నారు.