- ప్రజల కోసం పనిచేయండి: ఎమ్మెల్సీ దండే విఠల్
కాగజ్ నగర్, వెలుగు: కొత్తగా గెలిచిన సర్పంచ్ లు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ సూచించారు. శుక్రవారం ఆయన ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, కౌటాల మండలాల్లో పర్యటించారు. బెజ్జూర్ మండలం తుమ్మలగూడ సర్పంచ్ కొండ రాంప్రసాద్, పలు వార్డు మెంబర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు.
వారికి విఠల్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నామని, నిరుద్యోగ యువత కోసం లైబ్రరీలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. బోదంపల్లి, కడంబా తదితర గ్రామాల పాలకవర్గాలను సన్మానించారు.
బీజేపీలో చేరిన ఇండిపెండెంట్ సర్పంచ్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాల గ్రామ పంచాయతీకి స్వతంత్రంగా గెలిచిన సర్పంచ్ కుంభ శారదతోపాటు, ఉప సర్పంచ్ ప్రకాశ్, పలువురు వార్డు సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
