తూప్రాన్ మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ పై అధికారులకు ఫిర్యాదు

 తూప్రాన్ మండలంలో  ఫీల్డ్ అసిస్టెంట్ పై అధికారులకు ఫిర్యాదు

తూప్రాన్, వెలుగు: సర్పంచుల ఎన్నికల్లో ఒక అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశాడని తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్  జింక లింగం పై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన పలువురు శుక్రవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. తూప్రాన్ ఎంపీడీవో, స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఎన్ఆర్ఈజీఎస్ జిల్లా ప్రాజెక్ట్  డైరెక్టర్, మెదక్ జిల్లా కలెక్టర్ ఆఫీస్​లో ఫిర్యాదు చేశామన్నారు. తను చెప్పిన అభ్యర్థికి ఓట్లు వేస్తే ఉపాధి పని చేయకుండానే మస్టర్లు రాసి ఉచితంగా కూలి ఇప్పిస్తానని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.