కోఆప్షన్ మెంబర్లుగా దివ్యాంగులకు ఛాన్స్ ఇవ్వాలె : కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ

కోఆప్షన్ మెంబర్లుగా  దివ్యాంగులకు ఛాన్స్ ఇవ్వాలె : కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ

కోల్​బెల్ట్, వెలుగు: కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లో కోఆప్షన్​మెంబర్లుగా దివ్యాంగులకు అవకాశం కల్పించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్​ కమిటీ వైస్ చైర్మన్​ పెద్దపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం మందమర్రి మండలం పులిమడుగులో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 

గ్రామాల్లోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, చేయూత పెన్షన్​దారులకు పూర్తిస్థాయి సేవలు అందించేందుకు పంచాయతీ పాలనలో కో ఆప్షన్ ​మెంబర్లను నియమించాలని కోరారు. పంచాయతీ అభివృద్ధిలో ప్రభుత్వం దివ్యాంగులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. సమావేశంలో కమిటీ మండల అధ్యక్షుడు ఇందూరి రమేశ్, బానోత్​రాజు, బొద్దుల బుచ్చిరాజం, ధరావత్​ రాందాస్, దురిశెట్టి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.