- హోంశాఖలో ఉద్యోగానికి ఎంపిక
కుంటాల, వెలుగు: కుంటాల మండల కేంద్రానికి చెందిన తాటి సాయితేజ గ్రూప్ 3 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గతేడాది గ్రూప్ 4లో సత్తా చాటి జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికై ప్రస్తుతం భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా వెలువడిన గ్రూప్ 3 ఫలితాల్లో సాయితేజ హోంశాఖ సీఐడీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సాయితేజ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు అభినందించారు.
