మెదక్ జిల్లాలోని పాదయాత్రగా ఆలయాలకు తరలిన సర్పంచ్ లు

మెదక్ జిల్లాలోని  పాదయాత్రగా ఆలయాలకు తరలిన  సర్పంచ్ లు

చిలప్ చెడ్, కౌడిపల్లి, వెలుగు: ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్​లు పాదయాత్రగా ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని  బండపోతుగల్ సర్పంచ్ వీరన్నగారి లక్ష్మీ ప్రవీణ్ రెడ్డి 3 ఓట్లతో గెలుపొందగా, చిలప్ చెడ్ సర్పంచ్ జూల అనిల్ 500కు పైగా మెజార్టీ తో గెలుపొందాడు. తాము సర్పంచ్​గా గెలిస్తే పాదయాత్ర చేస్తామని మొక్కుకున్నామన్నారు. శుక్రవారం బండపోతుగల్ నుంచి 70 మందితో లక్ష్మీ ప్రవీణ్​ కౌడిపల్లి  మండలంలోని తునికి నల్ల పోచమ్మ ఆలయానికి పాదయాత్రగా వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. 

చిలప్ చెడ్ నుంచి సర్పంచ్​అనిల్​పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. కౌడిపల్లి మండలం రాజిపేట పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి సర్పంచ్​ గా గెలుపొందిన బాంచ దుర్గమ్మ నాగభూషణం రాజిపేట నుంచి తునికి నల్ల పోచమ్మ వరకు వార్డ్ మెంబర్లతో కలిసి వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించారు.