బడుగుల లీడర్ కొరివి కృష్ణ స్వామి : నీలం మధు

బడుగుల లీడర్ కొరివి కృష్ణ స్వామి : నీలం మధు
  •     నీలం మధు 

పటాన్​చెరు, అమీన్​పూర్, వెలుగు: బడుగుల లీడర్ కొరివి కృష్ణ స్వామి అని మెదక్  పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్​చార్జి నీలం మధు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా చిట్కుల్ గ్రామంలోని ఎన్‌‌‌‌ఎంఆర్ క్యాంపు ఆఫీసులో కొరవి కృష్ణస్వామి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మధు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర మేయర్‌‌గా కొరవి కృష్ణస్వామి తన దూరదృష్టితో రూపొందించిన నగర మాస్టర్ ప్లాన్ నేటికీ చిరస్థాయిగా నిలిచిందన్నారు.

 బడుగుల ముద్దుబిడ్డగా గుర్తింపు పొందిన కృష్ణస్వామి ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, పాత్రికేయుడు, విద్యావేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన జీవితాంతం బహుజనుల పక్షాన నిలబడి వారి అభివృద్ధికి అంకితభావంతో పనిచేశారని గుర్తు చేశారు.ఆ మహానేత ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.