పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ హైమావతి

పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి :  కలెక్టర్ హైమావతి
  •     కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: వచ్చే ఏడాది జరిగే యూజీసీ నెట్​పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో జనవరి, ఫిబ్రవరిలో జరిగే పరీక్షల నిర్వహణ పై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూజీసీ నెట్ కోసం ఒక సెంటర్, జేఈఈ కోసం 2 సెంటర్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. 

ఆ సెంటర్ లో సీసీ కెమెరా, పవర్ సప్లై, వాటర్ ఫెసిలిటీ, ఫర్నిచర్, టాయిలెట్స్, కంప్యూటర్లు, నెట్ సౌకర్యం ఇతరత్రా సౌకర్యాలు చెక్ చేయాలని అధికారులను ఆదేశించారు. సెంటర్ల తనిఖీ తర్వాత ఆ నివేదికను ఎన్టీఏకు పంపించాలన్నారు. సమావేశంలో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, ఏఓ రాజ్ కుమార్, ప్రిన్సిపాల్ సూర్య ప్రకాశ్, నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేందర్ పాల్గొన్నారు.