
క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త సంఘటన జరిగింది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఎమర్జింగ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లు గ్రౌండ్ లోనే ఒకరినొకరు గొడవకు దిగారు. బుధవారం (మే 28) ఢాకాలో జరిగిన నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ లో దక్షిణాఫ్రికాకు చెందిన త్సెపో న్టులి, బంగ్లాదేశ్‌కు చెందిన రిపాన్ మోండోల్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. గొడవ తీవ్రత ఎక్కువ కావడంతో తీవ్రం కావడంతో కొట్టుకున్నారు కూడా. మధ్యలో అంపైర్ ఆపడంతో పరిస్థితి చల్లబడింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 105 ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ షెపోన్తులి బౌలింగ్ చేయడానికి వచ్చాడు.
►ALSO READ | IPL 2025: పంజాబ్, బెంగళూరు మధ్య రేపే క్వాలిఫయర్ 1.. మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు వెళ్ళేది ఆ జట్టే!
మొదటి బంతిని రిపాన్ మోండోల్ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత బ్యాటర్ వద్దకు వెళ్లిన బౌలర్ తన సహనాన్ని కోల్పోయి ఏదో మాట్లాడుతూ కనిపించాడు. తరువాత అతను దగ్గరకు రావడంతో బ్యాటర్ రిపాన్ వెనక్కి నెట్టాడు. దీంతో కోపంతో రగిలిపోయిన సఫారీ బౌలర్ అతన్ని తోసి హెల్మెట్ గ్రిల్‌ను పట్టుకున్నాడు. అంపైర్ తో పాటు కొంతమంది దక్షిణాఫ్రికా ఫీల్డర్లు విడదీసి పరిస్థితిని చక్కదిద్దారు. మ్యాచ్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లపై మ్యాచ్ అధికారులు చర్యలు తీసుకోని కఠిన శిక్షలు వెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 371 పరుగులకు ఆలౌట్ అయింది.
South Africa emerging player attacked on South Asian super power kanglu bangladesh player .#TerStegenOut pic.twitter.com/NNdvRVo1FK
— Vaibhu (@Vaibhualt_17) May 28, 2025