IPL 2025: పంజాబ్, బెంగళూరు మధ్య రేపే క్వాలిఫయర్ 1.. మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు వెళ్ళేది ఆ జట్టే!

IPL 2025: పంజాబ్, బెంగళూరు మధ్య రేపే క్వాలిఫయర్ 1.. మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు వెళ్ళేది ఆ జట్టే!

ఐపీఎల్ 2025 లో లీగ్ మ్యాచ్ లు ముగిశాయి. ఇక ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫైనల్ తో సహా మొత్తం నాలుగు మ్యాచ్ లతో ఈ సీజన్ ముగియనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ క్వాలిఫయర్ 1 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలబడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది. క్వాలిఫయర్ 1 లో ఓడిపోయిన జట్టు ఆదివారం (జూన్ 1) క్వాలిఫయర్ 2 ఆడాల్సి ఉంది. 2016 తర్వాత ఆర్సీబీ ఫైనల్ కు చేరలేదు. మరోవైపు 2014 తర్వాత పంజాబ్ ఫైనల్ కు వెళ్ళలేదు. ఈ రెండు జట్లకు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ కొట్టలేదు. 

ఈ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఈ రెండు జట్లు ఈ సారి ట్రోఫీ గెలవడానికి ఇదొక చక్కని అవకాశం. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ చండీఘర్ లో జరగనుండడంతో పంజాబ్ జట్టుకు కలిసి రానుంది.  

►ALSO READ | IND vs ENG: అనుభవం లేకపోగా రెస్ట్ కావాలంట: ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు గిల్, పంత్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ సమరంలో పంజాబ్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. టోర్నీలో 14 మ్యాచ్ ల్లో 19 పాయింట్లతో పంజాబ్ టేబుల్ టాపర్ గా గ్రూప్ స్టేజ్ ముగించింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచ్ ల్లో 19 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే లీగ్ దశలు టాప్ లో ఉన్న పంజాబ్ ఫైనల్ కు చేరుతుంది. 

గ్రూప్ స్టేజ్ లో పంజాబ్, ఆర్సీబీ సమాన పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ పంజాబ్ కు ఎక్కువగా ఉంది. పంజాబ్ నెట్ రన్ రేట్    +0.372 ఉంటే ఆర్సీబీ నెట్ రన్ రేట్ +0.301 ఉంది. వర్షం పడి మ్యాచ్ రద్దయితే క్వాలిఫయర్ 1 కు రిజర్వ్ డే లేదు. దీంతో పంజాబ్ టేబుల్ టాపర్ కాబట్టి ఫైనల్ కు వెళ్తుంది. ఈ మ్యాచ్ కు ఎలాంటి వర్షం ముప్పు లేకపోవడం గుడ్ న్యూస్. మ్యాచ్ సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.