IND vs ENG: అనుభవం లేకపోగా రెస్ట్ కావాలంట: ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు గిల్, పంత్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

IND vs ENG: అనుభవం లేకపోగా రెస్ట్ కావాలంట: ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు గిల్, పంత్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

ఐపీఎల్ ముగించుకున్న తర్వాత భారత 'ఏ' జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ లయన్స్ తో మ్యాచ్ కు సిద్ధమవుతుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో యంగ్ ఇండియా రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. తొలి టెస్ట్ మే 30 నుండి కాంటర్‌బరీలోని స్పిట్‌ఫైర్ గ్రౌండ్‌లో జరుగుతుంది. ఇంగ్లాండ్ లయన్స్ తో జరగబోయే ఈ రెండు మ్యాచ్ ల సిరీస్ నుంచి టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ కు రెస్ట్ ఇచ్చారు. రెండో టెస్ట్ జూన్ 6న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు గిల్ మొదట ఆడతాడని కన్ఫర్మ్ చేశారు. అయితే ప్రస్తుతం గిల్ ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. 

గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న గిల్.. శుక్రవారం (మే 30) ముంబై ఇండియన్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే క్వాలిఫయర్ 2 లో ఆదివారం (జూన్ 1) జరగనుంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి గుజరాత్ ఫైనల్ కు వస్తే జూన్ 3 వరకు ఇండియాలోనే ఉండాలి. దీంతో గిల్ కు బీసీసీఐ రెస్ట్ తీసుకోమని శుభవార్త చెప్పి అతడిని ఇండియా ఏ స్క్వాడ్ నుంచి రిలీజ్ చేసింది. కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు కెప్టెన్ గా గిల్ ఫిట్ గా ఉండడం చాల ముఖ్యం. గిల్ తో పాటు రిషబ్ పంత్ కు కూడా రెస్ట్ తీసుకోనున్నాడు.

►ALSO READ | LSG vs RCB: పంత్ అప్పీల్ వెనక్కి తీసుకోకున్నా జితేష్ నాటౌట్.. మన్కడింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

'ఎ' గేమ్‌లో పాల్గొనకపోయినా జూన్ 13 నుండి ప్రారంభమయ్యే ఇంట్రా-స్క్వాడ్ వార్మప్ గేమ్ ఆడే అవకాశం గిల్ కు లభిస్తుంది. గిల్ తో పాటు టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, సాయి సుదర్శన్ ఇండియా 'ఏ' మ్యాచ్ లకు దూరంగా ఉన్నట్టు సమాచారం. ఇంగ్లాండ్ సిరీస్ లో గిల్ కు అనుభవం లేదు. తొలిసారి కెప్టెన్సీ చేస్తున్నాడు. ఈ సమయంలో ఇంగ్లాండ్ లో పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి గిల్ ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడడం చాల కీలకం. అయితే ఐపీఎల్ కారణంగా శుభమాన్ కు రెస్ట్ ఇవ్వక తప్పలేదు. 

ఇంగ్లండ్ టూర్‌కు భారత ఎ జట్టు:

అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, హర్షిత్ కమ్‌ద్‌రాజ్, హర్షిత్ రణా గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే.