
ఐపీఎల్ 2025లో మంగళవారం (మే 27) రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాత్ చేసిన మన్కడింగ్ విమర్శలకు గురవుతుంది. ఇన్నింగ్స్ 17 ఓవర్లో లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాత్ నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న జితేష్ శర్మను మన్కడింగ్ చేశాడు. అయితే లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ తమ అప్పీల్ ను వెనక్కి తీసుకోవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. ఒకవేళ పంత్ అప్పీల్ వెనక్కి తీసుకోకపోయినా అది నాటౌట్ అని రూల్స్ చెబుతున్నాయి.
దిగ్వేశ్ నాన్ స్ట్రైకింగ్ లో రనౌట్ చేసే సమయంలో జితేష్ క్రీజ్ దాటిన మాట నిజమే. దీంతో పంత్ అప్పీల్ వెనక్కి తీసుకోకపోతే జితేష్ ఔటయ్యేవాడని అందరూ భావించారు. పంత్ పై క్రీడా స్ఫూర్తిపై ప్రశంసలు కురిపించి జితేష్ బతికిపోయాడని అందరూ అనుకున్నారు. అయితే MCC లా 38.3.1 ప్రకారం ఒక ఆటగాడు పాపింగ్ క్రీజ్ అనగా అంపైర్ కు ముందు ఉన్న క్రీజ్ దాటి తన బౌలింగ్ యాక్షన్ ఆపేస్తే నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న బ్యాటర్ ను రనౌట్ చేయడానికి సాధ్యం కాదని రూల్స్ చెబుతున్నాయి.
దిగ్వేశ్ పాపింగ్ తన బౌలింగ్ యాక్షన్ తో క్రీజ్ దాటి వెళ్ళాడు. ఆ తర్వాత తన బౌలింగ్ యాక్షన్ ను సడన్ గా ఆపేసి నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న జితేష్ ను రనౌట్ చేసి అప్పీల్ చేశాడు. దిగ్వేశ్ పాపింగ్ క్రీజ్ దాటే సమయానికి జితేష్ బ్యాట్ క్రీజ్ లోనే ఉంచాడు. ఆ తర్వాత దిగ్వేశ్ బౌలింగ్ యాక్షన్ చూసి క్రీజ్ దాటాడు. ఎలాగో పంత్ అప్పీల్ ను వెనక్కి తీసుకోవడంతో దిగ్వేశ్ బతికిపోయాడు. లేకపోతే మరిన్ని విమర్శలకు గురయ్యేవారు. దిగ్వేశ్ రనౌట్ చేశా సమయానికి జితేష్ 57 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు.
నాటౌట్ గా థర్డ్ అంపైర్ ప్రకటించడంతో జితేష్ మరింత రెచ్చిపోయాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 8 బంతుల్లో 28 పరుగులు చేసి ఆర్సీబీకి సంచలన విజయాన్ని అందించాడు. దీంతో లక్నో ఓటమితో ఈ టోర్నీ ముగించగా.. ఆర్సీబీ రాయల్ గా క్వాలిఫయర్ 1 లోకి అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది.
Digvesh Rathi did Mankad
— Selfless⁴⁵ (@SelflessCricket) May 27, 2025
It was out but Rishabh Pant took back the appeal.
Gentleman Game Moment. 🫡 pic.twitter.com/oWMiMzVJQK