న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ ముంగిట టీమిండియాకు గుడ్‌న్యూస్. గజ్జల్లో గాయం నుంచి కోలుకున్న హైదరాబాద్ డాషింగ్ బ్యాటర్ తిలక్ వర్మ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తిలక్‌కు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) మెడికల్ క్లియరెన్స్ ఇవ్వనుంది.
దాంతో ఫిబ్రవరి 3న ముంబైలో తను ఇండియా జట్టుతో కలవనున్నాడు. ఈ నెల 7న సర్జరీ చేయించుకున్న తిలక్ శుక్రవారం జరిగిన సిమ్యులేషన్ మ్యాచ్‌లో పాల్గొని తన మ్యాచ్ ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడని బోర్డు వర్గాలు తెలిపాయి. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన 23 ఏండ్ల ఈ యంగ్ బ్యాటర్ ఇప్పుడు నేరుగా వరల్డ్ కప్ వామప్ మ్యాచ్‌ల్లో పాల్గొంటాడు.
