రంజీ ట్రోఫీ గ్రూప్‌‌‌‌–డి: హైదరాబాద్ 631.. ప్రజ్ఞయ్‌‌‌‌ రెడ్డి సెంచరీ

రంజీ ట్రోఫీ గ్రూప్‌‌‌‌–డి: హైదరాబాద్ 631.. ప్రజ్ఞయ్‌‌‌‌ రెడ్డి సెంచరీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రంజీ ట్రోఫీ గ్రూప్‌‌‌‌–డిలో భాగంగా  చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌తో జరుగుతున్న  తమ చివరి మ్యాచ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌లో దుమ్మురేపింది. హిమతేజ (171)కు తోడు ప్రజ్ఞయ్‌‌‌‌ రెడ్డి (126) సెంచరీతో అదరగొట్టడంతో తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 631 రన్స్ వద్ద ఆలౌటైంది. రంజీల్లో హైదరాబాద్‌‌‌‌కు నాలుగో అత్యధిక స్కోరు కావడం విశేషం.

ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరు 415/4తో మూడో రోజు, శనివారం ఆట కొనసాగించిన హైదరాబాద్‌‌‌‌కు హిమతేజ, ప్రజ్ఞయ్‌‌‌‌ భారీ స్కోరు అందించారు.  అనంతరం 348 రన్స్  లోటుతో రెండో ఇన్నింగ్స్‌‌‌‌కు వచ్చిన చత్తీస్‌‌‌‌గఢ్ మూడో రోజు చివరకు 100/2 స్కోరుతో నిలిచింది. అనుజ్ (47 బ్యాటింగ్‌‌‌‌), అమన్‌‌‌‌దీప్ (25 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉండగా..  ఆ జట్టు ఇంకా248 రన్స్‌‌‌‌ వెనుకంజలో ఉంది. ఆటకు ఆదివారమే ఆఖరి రోజు.