Suzlon Stock: లక్షను రూ.39 లక్షలుగా చేసిన సుజ్లాన్ స్టాక్.. పరుగు ఇంకా మిగిలి ఉందా..?

Suzlon Stock: లక్షను రూ.39 లక్షలుగా చేసిన సుజ్లాన్ స్టాక్.. పరుగు ఇంకా మిగిలి ఉందా..?

Suzlon Energy Shares: భారతీయ స్టాక్ మార్కెట్లు గడచిన రెండు రోజులుగా కొంత ఒడిదొడుకుల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది పెట్టుబడి పెట్టిన విండ్ ఎనర్జీ స్టాక్ సుజ్లాన్ షేర్లలో పెరుగుదల ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 

ఇంట్రాడేలో సుజ్లాన్ షేర్లు బీఎస్ఈలో ఒక్కోటి రూ.67.63 స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్టాక్ 3 శాతం వరకు లాభపడింది. గడచిన నెలరోజుల్లో మార్కెట్లు ఎలా ఉన్నప్పటికీ విండ్ ఎనర్జీ షేర్లు మాత్రం 17 శాతం లాభపడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లలో మరింత నమ్మకాన్ని నింపగలిగింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధరను పరిశీలిస్తే ఒక్కోటి రూ.86.04 వద్ద ఉన్న సంగతి తెలిసిందే.

Also Read:-హెచ్1బి వీసాలపై రగడ.. భారతీయ అధికారిపై ఆరోపణలు

గడచిన ఐదేళ్ల కాలంలో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు ఏకంగా 3800 శాతం రాబడిని తెచ్చిపెట్టింది. 2020 మార్చి 27న కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.1.72 వద్ద ఉంది. ఎవరైనా ఇన్వెస్టర్ అప్పట్లో కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే.. వారి పెట్టుబడి విలువ మార్కెట్ లెక్కల ప్రకారం రూ.39లక్షల 30వేలకు పైనే ఉండేది. వాస్తవానికి ఒకప్పుడు కేవలం పెన్నీ స్టాక్ గా ఉన్న కంపెనీ షేర్లు ప్రపంచ వ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీకి పెరుగుతున్న నిరంతర డిమాండ్ కారణంగా పుంజుకుంది. 

బ్రోకరేజీల మాటేంటి..
ప్రస్తుతం కంపెనీ షేర్లు తమ గరిష్ఠాలకు చేరువలో ట్రేడింగ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలా మంది ఇన్వెస్టర్లు ఈ సమయంలో సుజ్లాన్ షేర్లలో పెట్టుబడి పెట్టొచ్చా, దానికి ఉన్న అవకాశాలపై వెతుకుతున్నారు. ఈ క్రమంలో అసలు మార్కెట్లో నిపుణులు కంపెనీ షేర్ల భవిష్యత్తు ర్యాలీపై ఎలా ఉన్నారనే విషయం గమనిద్దాం.

* దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వార్ సుజ్లాన్ స్టాక్ టార్గెట్ ధరను రూ.75గా పేర్కొంటు కొనుగోలు రేటింగ్ అందించింది.
* ఇదే క్రమంలో జేఎమ్ ఫైనాన్షియల్ కంపెనీ షేర్లను కొనుగోలు చేయెుచ్చంటూ టార్గెట్ ధరను రూ.71గా పేర్కొంది. 
* మోర్గన్ స్టాన్లీ సుజ్లాన్ షేర్లకు ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ధరను రూ.73గా ఫిక్స్ చేసింది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.