బీఆర్ఎస్ పార్టీని కుర్చీ మడతపెట్టి కొట్టిన జూబ్లీహిల్స్ జనం

 బీఆర్ఎస్ పార్టీని కుర్చీ మడతపెట్టి కొట్టిన జూబ్లీహిల్స్ జనం

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్​ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి వేదికపైనా కాంగ్రెస్‌‌‌‌పై కేటీఆర్​విమర్శనాస్త్రాలను సంధించారు. ఓ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాటనూ తన క్యాంపెయిన్‌‌‌‌లో వాడుకున్నారు. కుర్చీ  మడతపెట్టి కొడితే కాంగ్రెస్ ఖతమవ్వాలంటూ జూబ్లీహిల్స్​ఓటర్లకు  పిలుపునిచ్చారు. కానీ, అది బూమరాంగ్​అయ్యింది. నియోజకవర్గ ప్రజలు రిటర్న్​ గిఫ్ట్​కింద.. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌నే కుర్చీ మడతెట్టి కొట్టారని పొలిటికల్​సర్కిల్స్‌‌‌‌లో కామెంట్స్‌‌‌‌ వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్​ వరుస రోడ్​షోలు చేసినా.. జనం ఆయన మాటలను పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఏ ఎన్నికలోనూ గెలవలే..

అసెంబ్లీ ఎన్నికల తర్వాత  కేటీఆర్ ​ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్​ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లింది.  కానీ, 17  సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా బీఆర్ఎస్​ గెలుచుకోలేకపోయింది. కొన్ని చోట్ల డిపాజిట్లే గల్లంతయ్యాయి. 2019 జనరల్ ​ఎలక్షన్లలో 9  సీట్లు గెలిచిన ఆ పార్టీ.. 2024 పార్లమెంట్​ ఎన్నికల్లో మాత్రం ఖాతానే తెరవకుండా జీరోతో సరిపెట్టుకున్నది. ఈ విషయంలో  నాయకుడిగా ఫెయిల్​ అయ్యారన్న అపవాదునూ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఎదుర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్​ పరిధిలోని సీట్లను  బీఆర్ఎస్​ ఎక్కువ సంఖ్యలో గెలుచుకున్నది. 17  సీట్లను సొంతం చేసుకున్నది. అయితే, 2024 మే 13న జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో..  కాంగ్రెస్​ అభ్యర్థి శ్రీ గణేష్‌‌‌‌పై  విజయం సాధించింది.