ATC లో డ్రాప్ అవుట్స్ పై దృష్టి పెట్టండి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ATC లో డ్రాప్ అవుట్స్ పై దృష్టి పెట్టండి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ATCల్లో అడ్మిషన్లు పెరుగుతున్న నేపథ్యంలో ఇక డ్రాప్‌ అవుట్ల తగ్గింపు మీద దృష్టి పెట్టాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ కు మంత్రి పలు సూచనలు చేశారు. 

హైదరాబాద్: మీ కృష్టితో ATCలో అడ్మిషన్లు పెరుతుగున్నాయి. ఇక డ్రాప్​ అవుట్లపై దృష్టి పెట్టాలి అని  ప్రిన్సిపల్​ సెకట్రరీ దాన కిషోర్​ కు మంత్రి వివేక్​ వెంకటస్వామి చెప్పారు.  ఐటీఐ కాలేజీలో వందశాతం హాజరు ఉండేలా చూడాలని కోరారు. టాటా కంపెనీ సపోర్టు ఉంది.. సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా టీచర్స్​ ట్రైనింగ్​ మీద దృష్టి సారించాలన్నారు. 

హైదరాబాద్​ లోని MCRHRD  భవన్​ లో ATC సెంటర్లలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెషిన్ యూజింగ్, బెస్ట్ ప్రాక్టీస్, కొత్త టెక్నాలజీ అడాప్షన్ పై ITI కాలేజీల ప్రిన్సిపల్స్ కు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్మిక, ఉపాధి, శిక్షణ, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ హాజరయ్యారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో 65 ATC ప్రిన్సిపల్స్, ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.