వాతావరణం చల్లగా మారింది. సర్ది, గొంతునొప్పితో పాటు వైరల్ ఫీవర్లు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటిని తట్టుకుని. నీరసానికి బై బై చెప్పాలంటే.. స్పైసీ సూప్స్ తాగాలి, మరిఇంకెందుకు ఆలస్యం .. వింటర్ సీజన్ లో ఈ సూప్స్ ట్రై చేయండి. .. . . !
పచ్చి బఠాణీ సూప్ తయారీకీ కావాల్సినవి:
- పచ్చిబఠాణీలు- ముప్పావు కప్పు
- ఉల్లిగడ్డ తరుగు- పావు కప్పు
- వెల్లుల్లి తరుగు - ఒక టీ స్పూను
- నూనె - ఒక టీ స్పూన్
- ఉప్పు.. తగినంత
- మిరియాల పొడి- రుచికి సరిపడా
- పుదీనా తరుగు - ఒక టేబుల్ స్పూన్
- క్యారెట్ తరుగు- ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం: పచ్చిబఠాణీల్లో రెండు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి ఉడికించాలి. బఠాణీలు మెత్తగయ్యాక దింపేయాలి. చల్లారాక వాటిని మిక్సీలో వేసి పేస్టు చేయాలి. స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఉల్లిగడ్డ, వెల్లుల్లి తరుగు వేగించాలి. బఠాణీ పేస్టు, ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి ఇంకొద్ది సేపు మరిగించాలి. చివరగా పుదీనా, క్యారెట్ తరుగుతో గార్నిష్ చేసుకుని తాగితే బాగుంటుంది.
గుమ్మడితో సూప్ తయారీకీ కావాల్సినవి
- గుమ్మడికాయ తరుగు- ఒక కప్పు
- ఉల్లిగడ్డ తరుగు- పావు కప్పు
- లవంగాలు- మూడు
- అల్లం తరుగు - అర టీ స్పూన్
- తాజా కొబ్బరి పాలు- ఒక కప్పు
- నీళ్లు-ఒక కప్పు
- వెన్న-రెండు టీ స్పూన్లు
- ఉప్పు- తగినంత
- జీలకర్ర పొడి- చిటికెడు.
తయారీ విధానం : పాన్ లో వెన్నని కరిగించాలి. అందులో లవంగాలు, ఉల్లిగడ్డ తరుగు, గుమ్మడికాయ తరుగు వేయాలి. ముక్కలు మెత్తపడ్డాక దింపేయాలి. అవి చల్లారాక ఒక కప్పు నీళ్లు పోసి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని మళ్లీ పాన్లో వేసి ఉడికించాలి. చివర్లో జీలకర్ర పొడి, కొబ్బరి పాలు వేసి బాగా కలిపి వెంటనే స్టవ్ ఆపేయాలి. కొబ్బరి పాలు పోశాక ఎక్కువగా
ఉన్నప్పుడు ఈ సూప్ తాగితే, టేస్ట్ సూపర్ గా ఉంటుంది.
కొత్తిమీర-లెమన్ సూప్ తయారీకీ కావాల్సినవి:
- కావాల్సినవి: కొత్తిమీర తరుగు - అర కప్పు
- ఉల్లిగడ్డ తరుగు-పావు కప్పు
- ఉల్లికాడ తరుగు - ఒక టేబుల్ స్పూన్
- అల్లం తరుగు-అర టీ స్పూన్
- వెల్లుల్లి ముద్ద - కొద్దిగా
- నిమ్మరసం- రెండు టేబుల్ స్పూన్లు
- వెజిటబుల్ స్టాక్ (కూరగాయ ముక్కలు ఉడికించిన నీళ్లు)- నాలుగు కప్పులు
- మిరియాల పొడి- రుచికి సరిపడా
- ఉప్పు - తగినంత
- నూనె లేదా వెన్న- ఒక టీ స్పూన్
తయారీ విధానం : పాన్ లో నూనె లేదా వెన్న వేడి చేయాలి. అందులో ఉల్లిగడ్డ తరుగు, ఉల్లికాడ తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి ముద్ద వేసి వేగించాలి.. రెండు నిమిషాల తర్వాత వెజిటబుల్ స్టాక్ పోసి కలపాలి. ఆపైన కొత్తిమీర తరుగు, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. సూప్ చిక్కగా అయ్యాక స్టవ్ ఆపేయాలి. వేడివేడిగా ఈ సూప్‌ను తాగితే గొంతు రిలీఫ్ గా ఉంటుంది.
