టర్మ్ ఇన్సూరెన్స్ కొంటున్నారా: మీ ఫ్యామిలీకి డబ్బు దక్కాలంటే ఇది తప్పక చేయండి

టర్మ్ ఇన్సూరెన్స్ కొంటున్నారా: మీ ఫ్యామిలీకి డబ్బు దక్కాలంటే ఇది తప్పక చేయండి

ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు తమ మరణం తర్వాత ఫ్యామిలీకి మంచి ఆర్థిక పరిస్థితి కొనసాగాలనే కోరికతో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు కొంటున్నారు. కనీసం కోటి నుంచి ఆపైన ఎంత వ్యక్తి మరణం తర్వాత దక్కినా మంచిదే కధ అనుకుంటున్నారు. అయితే చాలా మంది చేస్తున్న చిన్న పొరపాటు వల్ల మరణం తర్వాత ఫ్యామిలీకి డబ్బు చేరటం లేదు. సంపన్నులు ఫాలో అయ్యే ఈ టెక్నిక్ గురించి పాలసీ కొనుగోలు సమయంలో ఇన్సూరెన్స్ ఏజెంట్ లేదా ఇన్సూరెన్స్ విక్రయిస్తున్న కంపెనీని తప్పకుండా అడిగితే లాభదాయకం.

వాస్తవానికి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసిన వ్యక్తి మృతి చెందితే అతను అందించిన నామినీ వివరాల ప్రకారం చట్టపరంగా ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బు అందించాల్సి ఉంటుంది. అయితే ఆ వ్యక్తి మరణానికి ముందు తీసుకున్న ఏవైనా రుణాలు లేదా లోన్స్ చెల్లింపు కాకుండా ఉన్నట్లయితే టర్మ్ పాలసీ డబ్బును సదరు సంస్థ క్లెయిమ్ చేసుకోకుండా పాలసీదారుడి కుటుంబానికి డబ్బు చెందేలా చేయాలంటే MWP అనే ఆప్షన్ పాలసీ కొనుగోలు సమయంలోనే ఎనేబుల్ చేసుకోవాలి. దీనినే మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్(MWP) అంటారు. 

పాలసీ కొనేటప్పుడే MWP యాక్ట్ ఆప్ట్ చేసుకుంటే మరణించిన వ్యక్తికి ఎన్ని లోన్స్ ఉన్నప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు అతని ఫ్యామిలీకే దక్కుతాయి. చట్టప్రకారం దానిని అడ్డుకోవటం ఎవరి వల్ల కాదు. అందువల్ల మీరు కొత్తగా టర్మ్ ఇన్సూరెన్స్ కొంటున్నట్లయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియే, కంప్లెయింట్స్ రేషియో, క్లెయిమ్ సెటిమ్మెంట్ రేషియో, తక్కువ ప్రీమియం ఎంపికలతో పాటుగా ఈ MWP ఆప్ట్ చేసుకోవటం కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి. అప్పుడే మీరు కోరుకున్నట్లు మీ ఫ్యామిలీకి ఆర్థిక భరోసా లభిస్తుంది. 

అసలు మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్(MWP) ఏంటి..?

మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ (1874) వివాహిత మహిళలకు ఆస్తిపై పూర్తీ హక్కులను కల్పించే చట్టం. భార్య పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తి, సంపాదన, ఇన్సూరెన్స్ డబ్బు భర్త రుణాల చెల్లింపుల కోసం ఉపయోగించరాదు. ఆమె కాంట్రాక్ట్‌లు చేయవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో భార్య/పిల్లలకు మాత్రమే డబ్బు లభిస్తుంది. ఇది మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని, భద్రతను కల్పిస్తుంది.