ఉండ్రుగొండ గాలి పీలిస్తే రోగాలు నయమవుతాయట. ఎందుకంటే.. గ్రామం. చుట్టూ ఉన్న అడవుల్లో వేల రకాల ఔషధ మొక్కలున్నాయి. ఇదొక్కటే కాదు ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి ఇక్కడ, యాదవరాజులు ఇక్కడ ఇరవై మూడు ఆలయాలు నిర్మించారు. అప్పట్లో తవ్వించిన చెరువులు, కుంటలు నేటికీ సాగు నీరందిస్తున్నాయి. ఉండ్రుగొండ గుట్టపై కొలువైన నరసింహస్వామిని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల సమ్మకం..
సూర్యాపేటకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రచారం లేకపోవడంతో ఈ ప్రాంతానికి ఎక్కువగా పేరు రాలేదు. కానీ ఇక్క డకి ఒక్కసారి వచ్చిన వాళ్లు మళ్లీ మళ్లీ రావాలని అనుకుంటారు. సూర్యాపేట నుంచి కోదాడ వెళ్లే వారిలో కుడివైపు ఒక సింహద్వారం కనిపిస్తుంది.ఆ ద్వారంలోకి ప్రవేశించి వెళ్తుంటే దారి పొడవునా పచ్చని చెట్లు, చెరువులు, కుంటలు, పురాతన ఆలయాలు, కోటగోడలు కనిపిస్తాయి. యాదవరాజుల పాలనాకాలంలో ఇక్కడ 23 ఆలయాలను నిర్మించారు.
చుట్టూ గుట్టలే.. ఉండ్రుగొండ చుట్టూ ఎత్తైన గుట్టలున్నాయి. యాదవ రాజులు ఈ గుట్టలను కేంద్రంగా చేసుకుని పరిపాలించినట్లు చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయి. ఈ గుట్టపై ఉన్న రాజప్రసాదాలు, కోట గోడల అనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. వాళ్లు ఇక్కడ తవ్వించిన చెరువులు, కుంటలు ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి . గ్రామానికి సమీపంలో ఉన్న పెద్ద చెరువు కింద ప్రస్తుతం మూడు వందల ఎకరాలకు నీరందుతోంది.
నీటిని ఒడిసి పట్టారు: అప్పట్లో రాజులు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు కోనేరులను తవ్వించారు. వర్షం పడ్డప్పుడు గుట్ట లపైనుంచి పచ్చేనీళ్లు ఈ కోనేరుల్లో చేరుతాయి. వాటిలో ఒకటి లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర ఉంది. మరొకటి గంగామల్లికార్జునస్వామి ఆలయం దగ్గది ఉంది. చిన్నపాటి వర్షం కురిసినా ఇవి నిండుతాయి.
వరాలిచ్చే లక్ష్మినరసింహుడు: ఉండ్రుగొండ గుట్టపై కొలువైన లక్ష్మీనరసింహుడికి ఎన్నో మహిమలు ఉన్నట్లు భక్తులు చెప్తుంటారు. ఏ పనైనా ఆటంకం లేకుండా పూర్తవుతుందని భక్తుల నమ్మకం.. పిల్లలు లేని వారు స్వామి వారికి దర్శించుకుంటే సంతానప్రాప్తి కలుగుంది. రోజూ ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఇక్కడ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వ హిస్తారు. ప్రస్తుతం ఈ ఈ అలయం పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది..
నడిచే వెళ్లాలి: 65వ నెంబర్ జాతీయ రహదారి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఉండ్రుగొండ. కానీ ఆ నాలుగు కిలోమీటర్లు నడిచే వెళ్లాలి. లేదంటే సొంత వాహనంపై వెళ్లాలి. బస్సు సౌకర్యం లేదు. గ్రామం నుంచి గుట్టమీది వరకూ సీసీ రోడ్డు వేశారు. కానీ దాని పక్కన ముల్ల చెట్లు పెరిగి నడవడానికి వీలు లేకుండా ఉంది.
రోగాలు మాయం: ఈ గ్రామం సమీపంలో వేల ఎకరాల్లో అదవి విస్తరించి ఉంది. ఉండ్రుగొండ గుట్టల్లో వేల రకాల చెట్లు ఉన్నాయి. వీటిలో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి. అందుకే ఇక్కడి గాలి పీలిస్తే నయమవుతాయని స్థానికులు చెప్తున్నారు. ఇది తెలిసిన చాలామంది గ్రామానికి వచ్చి ఆలయంలో రెండు మూడు రోజులపాటు బసచేసి వెళ్తుంటారు...
