దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి(NVS)లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ – టీచింగ్ పోస్టుల భర్తీకి సీబీఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ డిసెంబర్ 04.
పోస్టులు: 14,967
కేంద్రీ విద్యాలయ సంఘటన్: మొత్తం ఖాళీలు9126. అసిస్టెంట్ కమిషనర్ 08, ప్రిన్సిపాల్ 134, వైస్ ప్రిన్సిపాల్ 58, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీఎస్) 1465, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీఎస్) 2794, లైబ్రేరియన్ 147, ప్రైమరీ టీచర్స్ (పీఆర్టీఎస్) 3365, నాన్– టీచింగ్ పోస్టులు 1144.
నవోదయ విద్యాలయ సమితి: మొత్తం ఖాళీలు 5841. అసిస్టెంట్ కమిషనర్ 09, ప్రిన్సిపాల్ 93, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీఎస్) 1513, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీఎస్ మాడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్) 18, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీఎస్) 2978, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీఎస్ థర్డ్ లాంగ్వేజ్) 443, నాన్– టీచింగ్ పోస్టులు 787.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్, బి.ఎడ్, బి.లైబ్రరీ, ఎం.కాం, బి.కాం, బి.టెక్/ బీఈ, ఏదైనా డిగ్రీ,
12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్టును అనుసరించి వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. నిర్దిష్ట వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 18 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 50 ఏండ్లు. ప్రతి పోస్టుకు వేర్వేరు వయోపరిమితులు ఉన్నాయి. నిర్దిష్ట వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 14.
అప్లికేషన్ ఫీజు: అసిస్టెంట్ కమిషనర్/ ప్రిన్సిపాల్/ వైస్ ప్రిన్సిపాల్: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2800. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్‌మెన్ రూ.500.
పీజీటీ/ టీజీటీ/ పీఆర్టీ/ ఏఈ/ ఫైనాన్స్ ఆఫీసర్/ ఏఓ/ లైబ్రేరియల్/ ఏఎస్ఓ/ జూనియర్ ట్రాన్స్ లేటర్: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2000. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్‌మెన్ రూ.500.
ఎస్ఎస్ఏ/ స్టెనోగ్రాఫర్/ జేఎస్ఏ/ ల్యాబ్ అటెండెంట్/ మల్టి–టాస్కింగ్ స్టాఫ్: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1700. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్‌మెన్ రూ.500.
లాస్ట్ డేట్: డిసెంబర్ 04.
పూర్తి వివరాలకు kvsangathan.nic.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
సెలెక్షన్ ప్రాసెస్
కేవీఎస్: అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్ , పీఆర్టీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ ట్రాన్స్ లేటర్.
ఎన్వీఎస్: అసిస్టెంట్ కమిషనర్(అకడామిక్స్), ప్రిన్సిపాల్, పీజీటీ. పైన పేర్కొన్న పోస్టులకు రెండంచెల పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటాయి. అభ్యర్థులు టైర్-–2, ఇంటర్వ్యూలో పొందిన మార్కులకు వరుసగా 85 శాతం,15 శాతం వెయిటేజీ ఇచ్చి మెరిట్ జాబితా తయారు చేస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది.
కేవీఎస్: స్టెనోగ్రాఫర్ (గ్రేడ్ I & II), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్.
ఎన్వీఎస్: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (హెచ్ క్యూ/ ఆర్ఓ)/ జేఎన్ వీ.
పైన పేర్కొన్న పోస్టులకు రెండంచెల పరీక్ష, ఆ తర్వాత స్కిల్‌టెస్ట్ ఉంటాయి. అభ్యర్థులు టైర్–-2లో పొందిన మార్కుల ప్రకారం మెరిట్ జాబితా తయారు చేస్తారు. స్కిల్ టెస్టులో అర్హత సాధించిన తర్వాత ఫైనల్ మెరిట్ ఉంటుంది.
కేవీఎస్: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్.
ఎన్వీఎస్: ల్యాబ్ అటెండెంట్, మల్టి– టాస్కింగ్ స్టాఫ్.
పైన పేర్కొన్న పోస్టులకు ఇంటర్వ్యూ లేదా నైపుణ్య పరీక్ష ఉండదు. ఈ పోస్టులకు మెరిట్ జాబితా టైర్-–2లో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే తయారు చేస్తారు.
టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్
టైర్-1 ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఎన్వీఎస్లోని మల్టి-టాస్కింగ్ స్టాఫ్ మినహా అన్ని పోస్టులకు 2 గంటల సమయం ఇస్తారు. పార్ట్–Iలో జనరల్ రీజనింగ్ 20 ప్రశ్నలు 60 మార్కులకు, పార్ట్–IIలో న్యూమరికల్ ఎబిలిటీ 20 ప్రశ్నలు 60 మార్కులకు, పార్ట్–IIIలో బేసిక్ కంప్యూటర్ లిటరసీ 20 ప్రశ్నలు 60 మార్కులకు, పార్ట్–IVలో జనరల్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు 60 మార్కులకు, లాంగ్వేజ్ కాంపెటెన్సీ టెస్ట్ (ఇంగ్లిష్) 10 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ కాంపెటెన్సీ టెస్ట్ ( 12 భారతీయ భాషల్లో ఏదైనా) 10 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు లేదా 1 మార్కు కోత విధిస్తారు. నవోదయ విద్యాలయ సమితిలోని మల్టిటాస్కింగ్ స్టాఫ్‌కు నిర్వహించే టైర్–1 ఓఎంఆర్ బేస్డ్లో ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. పార్ట్-–Iలో జనరల్ ఇంగ్లిష్ & కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు 60 మార్కులకు, పార్ట్–-IIలో కంప్యూటర్ ఆపరేషన్ పై బేసిక్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు 120 మార్కులకు, లాంగ్వేజ్ కాంపెటెన్సీ టెస్ట్ (ఇంగ్లిష్) 20 ప్రశ్నలు 60 మార్కులకు, లాంగ్వేజ్ కాంపెటెన్సీ టెస్ట్ ( 12 భారతీయ భాషల్లో ఏదైనా) 20 ప్రశ్నలు 60 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు, 300 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు.
టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్
టైర్–2లో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్లో ఉంటుంది. పీజీటీ (12 భారతీయ భాషల్లో ఏదైనా), టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్) పోస్టులకు సంబంధిత భాషలో, మిగతా అన్ని పోస్టులకు ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో పరీక్ష నిర్వహిస్తారు. 150 నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. టైర్–2 ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ విధానంలో 60 ప్రశ్నలు 60 మార్కులకు, డిస్క్రిప్టివ్ విధానంలో 10 ప్రశ్నలు 40 మార్కులకు అడుగుతారు. టైర్–2లోని ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు.
