భారత్ నుంచి పాకిస్తాన్ కు వెళ్లిన సిక్కు మహిళ కనిపించకుండా పోయింది.. ప్రకాష్ పర్వ గురు నానక్దేవ జయంతి ఉత్సవాలను జరుపుకునేందుకు పంజాబ్నుంచి వందలాది మంది పాకిస్తాన్ లోని లాహోర్ వెళ్లగా.. అందరూ తిరిగి వచ్చారుకు కానీ ఓ మహిళ మాత్రం రాలేదు.. ఆ మహిళ ఏమైంది.. ఎందుకు అక్కడ ఉండిపోయింది?
పంజాబ్ కపుర్తలకు చెందిన 52 ఏళ్ల సిక్కు మహిళ సరబ్ జిత్ కౌర్.. ప్రకాష్ పర్వ గురు నానక్ దేవ్ జయంతి ఉత్సవాలను జరుపుకునేందుకు ఇతర సిక్కులతో కలిసి నవంబర్ 4న పాకిస్తాన్ లోని లాహోర్ వెళ్లింది. మతపరమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు రెండు దేశాలమధ్య ఒప్పందంలో భాగంగా వీరంతా అక్కడకు వెళ్లారు. ఈ ఏడాది ప్రకాష్ పర్వ గురునానక్ దేవ్ 555 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా దాదాపు 2వేల మంది సిక్కులు పాకిస్తాన్ వెళ్లారు. దాదాపు పది రోజులు పాకిస్తాన్ లో గడిపిన తర్వాత తిరిగి నవంబర్ 13న అందరూ భారత్ కు వచ్చారు. ఒక్క సరబ్ జిత్ కౌర్ తప్ప.
అయితే సరబ్జిత్ కౌర్మిస్సింగ్పై వెలుగులోకి వచ్చిన ఓ డాక్యుమెంట్సంచలనం రేపుతోంది..అందులో సరబ్ జిత్ కౌర మిస్సింగ్ వెనక అసలు రహస్యాన్ని బయటపెట్టింది.. ఆమె పాకిస్తాన్‌లో తప్పిపోయి అక్కడి వ్యక్తినే వివాహం చేసుకున్నట్లు నిఖానామా డాక్యుమెంట్ చెబుతోంది.
ఏంజరిగింది?
తప్పిపోయిన సిక్కు మహిళ సరబ్ జిత్ కౌర్ మతం మార్చుకొని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకుందని రుజువు చేసే ఉర్దూ లో ఉన్న నిఖానామా డాక్యుమెంట్ బయటపడింది. లాహోర్ కు 56 కిలోమీటర్లు దూరంలో ఉన్న షేక్ పురా నివాసి నాసిర్ హుస్సేన్ ను కౌర్ వివాహం చేసుకున్నట్లు ఇందులో రాసి ఉంది.
సరబ్ జిత్ కౌర్ కు ఇంతకు ముందే పెళ్లైంది.. ఆమె ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్తతో విడాకులైంది. ఆమె మాజీ భర్త కర్నైల్ సింగ్ ముప్పై ఏళ్లుగా ఇంగ్లండ్ లో ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. మిగతా సిక్కులు ఇచ్చిన సమాచారంతో పాకిస్తాన్ లోని పోలీసులు ఇతర ఏజెన్సీలకు సమాచారం అందించారు. ఆమె అదృశ్యంపై భారత మిషన్ పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) ప్రతియేటా పాకిస్తాన్ లోని చారిత్రక గురుద్వారాలకు ముఖ్యంగా ప్రకాష్ పర్వ్కు నివాళులర్పించేందుకు సిక్కులను పంపిస్తుంది. అక్టోబర్లో భద్రతా కారణాల దృష్ట్యా యాత్రకు అనుమతి నిరాకరించింది ప్రభుత్వం. అయితే రెండు వారాల తర్వాత సరిహద్దు అవతల ఉన్న నాన్‌కానా సాహిబ్ మందిరానికి 10 రోజుల యాత్ర కు వెళ్లేందుకు ప్రభుత్వం సిక్కు భక్తులను అనుమతించింది. సరబ్ జిత్ కౌర్ కు పాస్‌పోర్ట్ పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో జారీ చేశారు. ఆమె పాకిస్తాన్‌లో అదృశ్యమైందని తిరిగి ఇండియాకు రాలేదు.
