2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ అర్బన్, వెలుగు : 2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలుకు కీలకం కావడంతో, అధికారులు పూర్తి అవగాహనతో క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేయాలని జనగామ కలెక్టర్, ప్రధాన జనగణన ఆఫీసర్​ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. జిల్లాలో జనాభా గణన-2027 సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో జనగణనను రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో హౌస్ లిస్టింగ్  మే 11 నుంచి జూన్ 9 వరకు, రెండో దశలో జనాభా గణన 2027 ఫిబ్రవరిలో జరుగుతుందని వివరించారు. మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారన్నారు. కార్యక్రమంలో శిక్షణ నిర్వాహకులు, సీపీవో చినకోట్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.