
CTO Suresh Kumar: ఇటీవల అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారీగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 1500 మంది ఉద్యోగాలను కోల్పోనుండటంతో ప్రస్తుతం అమెరికాలో ఈ విషయంపై సోషల్ మీడియా వేదికల్లో దుమారం కొనసాగుతోంది.
అమెరికాలోని రిటైల్ దిగ్గజం స్థానిక అమెరికన్ పౌరుల ఉపాధి అవకాశాలను హెచ్1బి వీసా ఉద్యోగులకు అందిస్తోందని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ సంతతికి చెందిన చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సురేష్ కుమార్ పై ఎక్స్ లో ఆరోపణలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి ఆయన మే 2019లో కంపెనీలో బాధ్యతలు చేపట్టారు. మద్రాస్ ఐఐటీలో గ్రాడ్యుయేట్ అయిన కుమార్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం సంస్థల్లో కూడా గతంలో పనిచేశారు.
గతవారం 1500 మంది టెక్కీలను వాల్ మార్ట్ వారిలో ఎంత మంది హెచ్1బి వీసా హోల్డర్లు ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే మెుత్తం కంపెనీ ఐటీ డిపార్ట్మెంట్లో దాదాపు 40 శాతం మంది హెచ్1బి వీసా ఉద్యోగులే ఉన్నారని వారు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ఇవన్నీ అమెరికా పౌరులకు దక్కాల్సిన ఉపాధి అవకాశాలను వారు అంటున్నారు. వీసాలపై వచ్చి తమ ఉద్యోగాలను లాక్కుంటున్న విదేశీయులపై అమెరికన్లు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఉద్యోగులకు వాల్ మార్ట్ అమెరికా సీఈవో జాన్ ఫర్నర్, సీటీవో కుమార్ నుంచి మెమోలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న తొలగింపులు దీర్ఘకాలిక భవిష్యత్తు వ్యూహాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయంగా అందులో పేర్కొనబడి ఉంది. అమెరికా ఉద్యోగులను తొలగించి విదేశీయులను నియమించుకోవటానికి తొలగింపుల నిర్ణయం తీసుకోలేదని యాజమాన్యం వివరణ ఇచ్చింది. అలాగే అమెరికాలోని వాషింగ్టన్ డీసీ ఎయిర్ పోర్ట్ గేట్ ఏజెంట్లుగా భారతీయులను ఎందుకు నియమించారన్న నెటిజన్ వారిని పరాన్నజీవులంటూ కామెంట్ చేశాడు.