జాన్సన్ అండ్ జాన్సన్‎కు రూ.332 కోట్ల ఫైన్.. ఎందుకంటే..?

జాన్సన్ అండ్ జాన్సన్‎కు రూ.332 కోట్ల ఫైన్.. ఎందుకంటే..?

న్యూయార్క్: ఇంటర్నేషనల్​ఎఫ్​ఎంసీజీ కంపెనీ జాన్సన్​అండ్ జాన్సన్‎కు మరో ఎదురుదెబ్బ తగిలింది. టాల్క్ ఆధారిత  బేబీ పౌడర్ వాడకం వల్లే అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఆరోపించిన ఇద్దరు మహిళలకు 40 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.332 కోట్లు) చెల్లించాలని కాలిఫోర్నియా కోర్ట్ జాన్సన్ అండ్​జాన్సన్‎ను ఆదేశించింది. క్యాన్సర్‌‎కు చికిత్సగా మేజర్ సర్జరీలు, కీమోథెరపీ చేయించుకున్నామని బాధితులు కోర్టులో సాక్ష్యం చెప్పారు.  

అయితే, ఈ వాదనకు ఆధారాలు లేవని, టాల్క్ అండాశయాలను చేరుకోదని కంపెనీ న్యాయవాది వాదించారు. ఈ తీర్పు అసంబద్ధమని, తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ అప్పీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జే అండ్ జే కంపెనీపై 67 వేలకు పైగా దావాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అండాశయ  క్యాన్సర్ కేసులే!  గతంలో కొన్ని కేసుల్లో కోర్టులు 4.69 బిలియన్ డాలర్ల వరకు జరిమానాలు విధించాయి.