న్యూఢిల్లీ: ఈ వారం ఐపీఓ మార్కెట్‌బిజీబిజీగా ఉండనుంది. మొత్తం రూ.830 కోట్లను సేకరించేందుకు నాలుగు కొత్త ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. వీటిలో అతిపెద్దది కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఇది డిసెంబర్ 16 న ఓపెనై, 18న ముగుస్తుంది. షేరు ప్రైస్ రేంజ్‌ను రూ.365–రూ.384 గా నిర్ణయించారు. ఈ కంపెనీ సుమారు రూ.710 కోట్లు సేకరించనుంది.
ఈ నెల 12 న ఓపెనైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ 16 వరకు ఓపెన్‌లో ఉంటుంది. మరోవైపు కరోనా రెమిడీస్, పార్క్ మెడి వరల్డ్ వంటి పెద్ద కంపెనీల లిస్టింగ్‌లు ఉన్నాయి. ఈ వారం సుమారు 15 కంపెనీల లిస్టింగ్‌లు ఉన్నాయి. మరోవైపు ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో నెప్ట్యూన్ లాజిటెక్, మార్క్ టెక్నోక్రాట్స్, గ్లోబల్ ఓసియన్ లాజిస్టిక్స్ ఐపీఓలు ఉన్నాయి.
స్పేస్‌ఎక్స్ విలువ రూ.72 లక్షల కోట్లు
ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్, మరో రికార్డ్‌ను సెట్ చేయనున్నారు. ఆయన కంపెనీ స్పేస్‌ఎక్స్ త్వరలోనే ప్రపంచంలో అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీగా నిలవబోతోంది. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, తాజా డీల్‌లో స్పేస్‌ఎక్స్ వాల్యుయేషన్‌ను 800 బిలియన్ డాలర్లు (రూ.72 లక్షల కోట్లు) గా లెక్కించారు. ఒక్కో షేరు ధర 421 డాలర్లుగా ఉంది. కంపెనీ వచ్చే ఏడాది ఐపీఓకి రావాలని ప్లాన్ చేస్తోంది. అదే జరిగితే ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది నిలుస్తుంది.
