గుడ్ న్యూస్.. SBI డిపాజిట్లు, లోన్లపై తగ్గిన వడ్డీ రేటు

గుడ్ న్యూస్.. SBI డిపాజిట్లు, లోన్లపై తగ్గిన వడ్డీ రేటు

న్యూఢిల్లీ: ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చేలా కొన్ని వడ్డీ రేట్లలో స్వల్ప తగ్గింపులు ప్రకటించింది. రిటైల్ టర్మ్ డిపాజిట్లపై (రూ.3 కోట్లు లోపు) వడ్డీ రేటు  2–3 సంవత్సరాల కాలానికి గాను  6.45శాతం నుంచి 6.40శాతానికి  తగ్గించింది.  సీనియర్ సిటిజన్లకు అర శాతం ఎక్కువ వడ్డీని  ఆఫర్ చేస్తుండగా, తాజా రేట్ల కోతతో  వడ్డీ రేటు 6.95శాతం నుంచి 6.90శాతానికి తగ్గింది. ఇతర టర్మ్ డిపాజిట్ రేట్లు యథాతథంగా ఉన్నాయి. ప్రత్యేక 444-రోజుల “అమృత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వృష్టి’’  స్కీమ్ వడ్డీ రేటు కూడా 6.60శాతం నుంచి 6.45శాతానికి తగ్గింది.

లోన్లపై వడ్డీ..

ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ తన ఎంసీఎల్‌‎ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌అన్ని టెనర్లలో 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో హోమ్, ఆటో, ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈ  లోన్లకు కొంత ఉపశమనం లభిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు.. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ వన్ మంత్ – 7.85%, 3మంత్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – 8.25%, 6మంత్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – 8.60%,  వన్ -ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – 8.70%, 2-ఇయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – 8.75%, 3- ఇయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – 8.80శాతంగా ఉన్నాయి. ఈబీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌ 25 బేసిస్ పాయింట్లు తగ్గి 7.90శాతానికి  దిగొచ్చింది.