వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( డిసెంబర్14 నుంచి 20 వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం..
మేషరాశి:ఈ రాశివారికి అధి కార యోగం పట్టే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోండి. ఆదాయం పెరగడానికి చేసే ఎటువంటి ప్రయత్నమైనా ఆశించిన ఫలితాన్నిస్తుంది.ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు చాలా వరకు బిజీగా మారిపోతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలు అమలు చేసి లబ్ధి పొందుతారు.ఉద్యోగంలో అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్ప గించే అవకాశం ఉంది. అధికారులు ఆధారపడడం ఎక్కువవుతుంది. . ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది
వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో పాటు .. ప్రశంసలు లభిస్తాయి. అధికారులకు మీపై నమ్మకం పెరిగి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగస్తులు ... వృత్తి పని వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. ప్రతి వ్యవహారంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం సంపాదించుకుంటారు. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది.
మిథునరాశి: ఈ వారం ఈ రాశి వారికి గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఇప్పటి వరకు వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ప్రేమ... పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోండి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కర్కాటకం: ఈ వారం ఈ రాశివారికి యోగదాయకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మీ సమక్షంలో జరుగుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులు కెరీర్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఉద్యోగంలో సొంత లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు, తోటి ఉద్యోగులకు సహాయపడతారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. తరచు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.
సింహరాశి: ఈ రాశి వారికి అన్ని పనులలో సమస్యలు చాలావరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను, లక్ష్యాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. వ్యయ స్థానంలో గురువు స్థితి వల్ల ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.
కన్యా రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలతో ముఖ్యమైన వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. కీలక వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు పనిభారం పెరగడంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
తులారాశి: ఈ రాశి వారుఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలను .. ఆలోచనలను అందరూ అంగీకరిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి.. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో కూడా సహోద్యోగులకు సహాయపడడం జరుగుతుంది. వ్యాపారాలు సానుకూలంగా కొనసా గుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నిరుద్యోగులు మంచి ఆఫర్ అందుకుంటారు.
వృశ్చికరాశి: ఈ వారం ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మీ ఆశయాలు నెరవేరేందుకు స్నేహితులు సహకరిస్తారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఇల్లు లేదా వాహనాలు కొంటారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఊరట లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. స్నేహితుల వల్ల ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఈ వారం కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. వృత్తి.. ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.
మకరరాశి: ఈ రాశి వారికి ఈ వారం వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. చేతివృత్తుల వారు బిజీ అవుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండం చాలా మంచిది . ఆర్థిక విషయాల్లో ఎవరిని నమ్మకుండా.. మీ నిర్ణయాన్ని అమలు చేయండి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది. బ్యాంకు లావాదేవీలు అనుకూలిస్తాయి.ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఈ వారం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.
కుంభరాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి .. వ్యాపారాల్లో.. స్నేహితులు సహకారంతో ఆశించిన లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం .. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ భవిష్యత్తు విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మీకు పుష్కలంగా కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్నా అందుకు తగ్గట్టుగా ప్రతిఫలం అందుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోండి.
మీనరాశి: ఈ రాశి వారికి ఈ వారంలో ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి.. ఉద్యోగాల్లోమంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబసభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆకస్మికంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ వారం అనుకూలమైన సమయమని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
