హైదరాబాద్, వెలుగు: సుమధుర గ్రూప్ 100 ఎకరాలలో గ్రేడ్ ఏ ప్లస్ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే రెండేళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడి పెడుతుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో ఈ ఎంఓయూ జరిగింది. ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, ఈ–-కామర్స్ రంగాలకు ప్లగ్-అండ్-ప్లే సదుపాయాలు అందిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ తదుపరి రెండేళ్లలో దాదాపు 8,000 ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. సుమధుర గ్రూప్ వైస్- చైర్మన్ కలకుంట్ల రామారావు మాట్లాడుతూ, ఈ పెట్టుబడి ఉన్నత విలువ గల పరిశ్రమలను ఆకర్షించి, తెలంగాణ 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడానికి మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో బలమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ఉంటే పెద్ద కంపెనీలను ఆకర్షించవచ్చని కంపెనీ వైస్–-ప్రెసిడెంట్ వంశీ పేర్కొన్నారు.
