
Apollo Micro Systems: భారత్ ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా పూర్తి చేసినప్పటి నుంచి దేశీయ డిఫెన్స్ స్టాక్స్ బ్రేక్ లేకుండా బుల్ రన్ కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి భారత్ చేపట్టిన దాడుల్లో ఎక్కువగా స్వదేశీ టెక్నాలజీ, ఆయుధాలు, విదేశీ ఆయుధాలను స్వదేశీ టెక్నాలజీ అనుసంధంతో నిర్వహణ వంటి కీలక అంశాలు నేరుగా యుద్ధ భూమిలోనే విజయవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపించబడ్డాయి. దీంతో భారత డిఫెన్స్ టెక్నాలజీలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుతో పాటు కొత్త ఆర్డర్లు సైతం అందుతున్నాయి.
ALSO READ | Suzlon Stock: లక్షను రూ.39 లక్షలుగా చేసిన సుజ్లాన్ స్టాక్.. పరుగు ఇంకా మిగిలి ఉందా..?
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అపోలో మైక్రో సిస్టమ్స్ కంపెనీ గురించే. డిఫెన్స్ రంగానికి చెందిన ఈ సంస్థ షేర్లు నేడు ఇంట్రాడేలో 15 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. అయితే మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో షేర్ల ధర ఒక్కోటి 15 శాతం పైగా లాభంతో రూ.179.26 స్థాయి వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు 27 శాతం లాభపడ్డాయి. అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇప్పటి వరకు 45 శాతానికి పైగా ఈ స్మాల్ క్యాప్ స్టాక్ వృద్ధిని చూసింది.
ఈ మల్టీబ్యాగర్ డిఫెన్స్ స్టాక్ రెండేళ్ల కాలంలో పెట్టుబడిదారులు 420 శాతం రాబడిని తెచ్చిపెట్టడాగా.. 5 ఏళ్ల కాలంలో 2040 శాతం రాబడిని అందించి తన సత్తా చాటింది. అయితే ప్రస్తుతం కంపెనీ షేర్లు ర్యాలీలో కొనసాగటానికి కారణం కంపెనీ అందుకున్న కొత్త ఆర్డర్. కంపెనీ తాజాగా రూ.113కోట్ల 81 లక్షలు విలువైన ఎగుమతి ఆర్డర్ అందుకున్నట్లు వెల్లడైంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా అపోలో మైక్రో సిస్టమ్స్ పౌర, సైనిక విమాన అప్లికేషన్లలో ఉపయోగించడానికి ఉద్దేశించిన అధునాతన ఏవియానిక్స్ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే ప్రాజెక్టులో ఉన్న సున్నితమైన అంశాలను బయటకు పంచుకోకుండా ఉండేందుకు క్లయింట్ తో ఒప్పందంలో అంగీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. అందుకే ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నికల్ సమాచారాన్ని కంపెనీ గోప్యంగా ఉంచుతోంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.